రాంగీ లుక్‌

Trisha new movie Raangi film first look poster released - Sakshi

ఫారిన్‌లో చెన్నై సుందరి త్రిష అరెస్ట్‌ అయ్యారు. ఆమె ఫ్యాన్స్‌ అందరూ కంగారు పడాల్సిందేమీ లేదు. ఇది కేవలం ‘రాంగీ’ చిత్రంలోని ఓ సీన్‌ మాత్రమే. శరవణన్‌ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘రాంగీ’. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ డైలాగ్స్‌ రాశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి.. పోస్టర్‌లో త్రిష చేతికి బేడీలు వేసి ఉన్నాయి. దానికి గల కారణం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇటీవలే చెన్నైలో తొలి షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసిన చిత్రబృందం ప్రస్తుతం ఉబ్జెకిస్తాన్‌లో షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ సినిమాలో త్రిష కొన్ని రియల్‌ స్టంట్స్‌ కూడా చేస్తారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top