గ్యాప్‌ ఎందుకు వచ్చిందంటే?

Trisha Movies Delayed In Release - Sakshi

టీ.నగర్‌: ఏడాదిగా తన చిత్రం విడుదల కాలేదంటే నటించడం లేదని అర్థం కాదని నటి త్రిష అంటోంది. కమల్, విజయ్, అజిత్‌ అంటూ ప్రముఖ నటులందరితో ఏడాదిలో ఒకటి, రెండు చిత్రాల్లోనైనా నటిస్తూ వచ్చిన త్రిషకు  2016 ‘కొడి’ చిత్రం తర్వాత ఏ చిత్రం విడుదల కాలేదు. దీనిగురించి ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏడాదిగా తన చిత్రం విడుదల కాలేదంటే చిత్రాల్లో నటించడం లేదని అర్థం కాదని, చదురంగ వేట్టై 2, మోహిని, 96 చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. అనేక కారణాల వల్ల చిత్రాలు విడుదల కావడంలో ఆలస్యమయ్యాయని అన్నారు.

16 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఇంతవరకు డబుల్‌ రోల్‌లో నటించలేదని తెలిపారు. తాను దేనికీ భయపడేదాన్ని కానని, దెయ్యమన్నా భయం లేదన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అమానుష కార్యకలాపాలు కలిగిన ఈ థ్రిల్లర్‌ చిత్రంలో అనేక స్టంట్‌ సీన్లలో నటించాల్సి వచ్చిందన్నారు. డూప్‌ లేకుండా తాను ఒరిజినల్‌గా స్టంట్‌ సీన్లలో నటించాల్సి వచ్చిందన్నారు. మొదట్లో ఈ చిత్ర కథను హీరో కోసం రూపొం దించారని, తర్వాత దాన్ని హీరోయిన్‌ ఓరియెంటెడ్‌కు దర్శకుడు మార్చినట్లు తెలిపారు. చిత్రం షూటింగ్‌ పూర్తిగా లండన్‌లో జరిగిందన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top