ఫిబ్రవరిలో మోహిని వస్తోంది..

trisha mohini film releasing on feb 2018 - Sakshi

నటి త్రిష ఫిబ్రవరిలో తెరపై బీభత్సం సృష్టించడానికి మోహినిగా వస్తోంది. త్రిష చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అయ్యిందనే చెప్పాలి. 2016లో ధనుష్‌తో నటించిన కొడి చిత్రం తరువాత మరో చిత్రం విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా అరడజను చిత్రాలున్నాయి. వాటిలో ఒకటి మోహిని. ఆర్‌.మాదేశ్‌ దర్శకత్వం వహస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు సూర్య హీరోగా సింగం-2 చిత్రాన్ని నిర్మించిన లక్ష్మణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. పూర్ణిమభాగ్యరాజ్, యోగిబాబు, స్వామినాథన్, ఆర్తిగణేశ్, పన్నీర్‌పుష్పంగళ్‌ సురేశ్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. 

ఈ చిత్రం గురించి దర్శకుడు మాదేశ్‌ తెలుపుతూ.. తన గత చిత్రాల తరహాలోనే మోహిని భారీ ఎత్తున నిర్మిస్తున్నట్లు తెలిపారు. 80 శాతం విదేశాల్లో చిత్రీకరణ జరిపినట్లు చెప్పారు. ఇది హారర్‌ కథా చిత్రాలలో వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. నటి త్రిష యాక్షన్‌ సన్నివేశాలలోనూ నటించారని చెప్పారు. మోహిని చిత్రంలో విజువల్స్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, పాటలు చాలా బాగా ఉన్నాయని తెలిపారు. చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని, సెన్సార్‌ పూర్తి చేసి ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు మాదేశ్‌ తెలిపారు. చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సన్నివేశాలు 55 నిమిషాల పాటు ఉంటాయని, ఇది లండన్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం అని ఆయన అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top