పాత్రకు తగిన నాయకి ముఖ్యం | 'Tottal todarum' movie Love story and action scenes | Sakshi
Sakshi News home page

పాత్రకు తగిన నాయకి ముఖ్యం

Feb 17 2014 1:21 AM | Updated on Sep 2 2017 3:46 AM

పాత్రకు తగిన నాయకి ముఖ్యం

పాత్రకు తగిన నాయకి ముఖ్యం

కథాపాత్రలకు తగిన నాయకా నాయకిలు ముఖ్యం అంటున్నారు దర్శకుడు కేబుల్ శంకర్. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం తొట్టాల్ తొడరుం.

కథాపాత్రలకు తగిన నాయకా నాయకిలు ముఖ్యం అంటున్నారు దర్శకుడు కేబుల్ శంకర్. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం తొట్టాల్ తొడరుం. తమన్, అరుంధతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యాక్షన్ సన్నివేశాలతో కూడిన ప్రేమకథా చిత్రం అని తెలిపారు. వినోదంపాళ్లు ఎక్కువగానే ఉంటుందన్నారు. చిత్రంలో కీలకంగాఉన్న హీరోయిన్ పాత్ర  నటి అరుంధతిని ఎంపిక చేయాలని భావించిన ప్పుడు ఆమెతో ప్రత్యేకంగా  ఫొటో షూట్ చేయాలని నిర్ణయించామన్నారు.
 
 దాన్ని బట్టి ఆ పాత్రకు ఆ హీరోయిన్ కరెక్టా కదా అని నిర్ణయిస్తామని చెప్పారు. అలా అన్ని విధాలుగా తొట్టాల్ తొడరుం చిత్రంలోని హీరోయిన్ పాత్రకు సరిగ్గా సరిపోతుందని నిర్ణరుుంచుకున్న తరువాతనే ఆమెను ఎంపిక చేశామని తెలిపారు. చిత్రంలో చాలా కాలం తరువాత విన్సెంట్ అశోకన్ విలన్‌గా ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. ఇది మీడియం బడ్జెట్ చిత్రం అయినా నిర్మాత తువర్ చంద్రశేఖర్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదన్నారు. భారీ చిత్రాలకు ఉపయోగించే హెలికామ్ కెమెరా అవసరం అవడంతో విదేశాల నుంచి రప్పించారని, ఈ కెమెరాలో చిత్రంలోని పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు దర్శకుడు వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement