కెప్టెన్ మార్వల్ ప్రచారంలో హీరోయిన్ల సందడి

Tollywood Top Heroines at Captain Marvel Promotions - Sakshi

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్లు ఒకే వేదికపై కనిపిస్తే...అభిమానులకు కన్నుల పండుగే.  చెన్నైలో నలుగురు సినీతారలు ఒకే వేదికపై తళుక్కుమన్నారు. కెప్టెన్ మార్వల్ చిత్ర ప్రచారంలో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా, రకుల్‌ ప్రీత్‌సింగ్ సందడి చేశారు. మార్వెల్‌ కామిక్స్‌ పాత్ర ఆధారంగా రూపొందిన సూపర్‌ హీరో చిత్రం ‘కెప్టెన్‌ మార్వెల్‌’ . మహిళా దినోత్సవం రోజున (మార్చి 8)ఈ చిత్రం విడుదల కానుంది.

ప్రచారంలో భాగంగా వాళ్లకు ఇష్టమైన కామిక్‌ పాత్రలతో పాటు ఇతరత్రా విషయాలకు సంబంధించిన ముచ్చట్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నటీమణులు తమ నలుగురు భామలు ఒకే వేదికపై కనిపించడంతో.. వారిని చూడటానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్రస్థానం పేరుతో నటీమణులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సమయంలో నలుగురు ఒకేసారి కనిపించటం శుభపరిణామం అని చిత్రసీమ హర్షం వ్యక్తం చేస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top