‘చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది’

Tollywood Celebrities Queue To Wish Chiranjeevi Sye Raa Movie - Sakshi

ఎన్నో ఆశలు.. అంతకుమించి అంచనాలతో.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌చరణ్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’  తొలి షో నుంచే హిట్‌టాక్‌ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రానికి సామాన్య అభిమానులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. చిరంజీవి నటనకు, సినిమాను తెరకెక్కించిన విధానానికి ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ‘సైరా’థియేటర్లలోనే కాకుండా.. సోషల్‌ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ సినిమాపై సెలెబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

‘సైరా’పై సెలెబ్రిటీలు ఏమన్నారంటే
‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవితానికి చిరంజీవి గారు జీవం పోశారు. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను మళ్లీ వెలుగులోకి తెచ్చారు. జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. సినిమాకు వీరంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు’ - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 

'ఈ రోజు చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది.. చిత్ర యూనిట్‌కు హ్యాట్సాఫ్‌'- డైరెక్టర్‌ హరీష్ శంకర్

‘విజువల్‌ పరంగా సినిమా రిచ్‌గా, అద్భుతంగా ఉంది. చిరంజీవి తన నట విశ్వరూపం ప్రదర్శించారు. 'సైరా' తప్పక చూడాల్సిన సినిమా. నిర్మాతగా రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు. కళ్లు చెదిరే రీతిలో ఫొటోగ్రఫీ అందించి కెమెరామన్ రత్నవేలు రియల్లీ గ్రేట్‌. ఈ మధ్యకాలంలో నేను చూసిని సినిమాల్లో బెస్ట్‌ సినిమాటోగ్రఫీ ఇదే’ -హీరో మహేశ్‌ బాబు

‘నర్సింహారెడ్డిగా తెర మీద మెగాస్టార్ గర్జించారు. ప్రాజెక్టును బలంగా నమ్మి.. అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన రామ్‌చరణ్‌కు హ్యాట్సాఫ్. సురేందర్ రెడ్డి టేకింగ్ అద్భుతం. రత్నవేలు విజువల్స్  మైండ్ బ్లోయింగ్. తమన్నా అద్భుతంగా నటించింది’ - అనిల్ రావిపుడి

‘పదునాలుగేళ్ల మా కలను సాకారం చేసిన మెగాస్టార్‌కు, ఆయన కడుపున పుట్టిన పులిబిడ్డ రామ్ చరణ్‌కి వందనం ! అభివందనం! నిద్రలేని రాత్రులు గడిపి, ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారకుడైన సురేందర్‌రెడ్డికి, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు నమో నమః జై చిరంజీవా, జైజై సైరా’- పరుచూరి గోపాలకృష్ణ

‘సినిమా పట్ల ఉన్న అంకితభావం, ప్రేమకు గాను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు కంగ్రాట్స్. స్వాతంత్ర్య సమరయోధుడి కథను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు. అలాగే నయనతార, తమన్నాలు తమ పాత్రలతో వెండితెరపై మెరిశారు’ - శ్రీను వైట్ల 

‘ఎమోషన్స్, అనుభవానికి సైరా నర్సింహారెడ్డి పెద్ద పీట వేశారు. మెగాస్టార్ ఫెర్ఫార్మెన్స్ లెజెండరీగా నిలిచింది. సురేందర్ రెడ్డి చరిత్రను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎంత రిచ్‌గా ఉందో రాంచరణ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతే రిచ్‌గా ఉన్నాయి’ - సుధీర్ బాబు

చదవండి: సైరా ఫుల్‌ రివ్యూ (4/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top