సాయికి షాకిచ్చిన విజయ్ | theri telugu movie title Winner | Sakshi
Sakshi News home page

సాయికి షాకిచ్చిన విజయ్

Mar 26 2016 8:47 AM | Updated on Sep 3 2017 8:38 PM

సాయికి షాకిచ్చిన విజయ్

సాయికి షాకిచ్చిన విజయ్

పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్కు ఓ తమిళ స్టార్ హీరో షాక్ ఇచ్చాడు.

పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్కు ఓ తమిళ స్టార్ హీరో షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పటాస్ ఫేం అనీల్ రావిపూడి డైరెక్షన్లో సుప్రీమ్ సినిమాలో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమా తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు విన్నర్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అయితే సాయి అనుకున్న టైటిల్ను ముందుగానే తన సినిమా డబ్బింగ్ వర్షన్కు ఎనౌన్స్ చేశాడు తమిళ స్టార్ హీరో విజయ్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తేరి సినిమా చేసిన విజయ్, ఆ సినిమాను తమిళ్తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా అనువాద హక్కులు సొంతం చేసుకోవటంతో తెలుగులో కూడా తేరి సినిమా భారీ రిలీజ్కు రెడీ అవుతోంది.

తేరి సినిమా తెలుగు వర్షన్కు విన్నర్ అనే టైటిల్ను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికే ఈ టైటిల్ మీద ఆశపడుతున్న సాయి, దిల్ రాజు కోసం తన టైటిల్ను త్యాగం చేస్తాడా..? లేక మరోసారి టాలీవుడ్లో టైటిల్ వార్కు తెర లేస్తుందా..? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement