
ప్రస్తుతం సమాజంలో మహిళలపై ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. దుర్గ అనే ఓ మహిళ వాటిని ఎలా అరికట్టారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అనగనగా ఒక దుర్గ’.ప్రియాంకా నాయుడు టైటిల్ రోల్‌లో ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రాంబాబు నాయక్, అంజి యాదవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ–‘‘మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలను దుర్గ ఎలా ఎదుర్కొన్నారు. వాటి నిర్మూలనకు ఏ విధంగా కృషి చేశారన్నది ఆసక్తికరం.ప్రివ్యూ చూసినవారందరూ సినిమా బాగుందని అభినందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మేం చేసిన మంచి ప్రయతాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని చిత్ర సమర్పకుడు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, నిర్మాత రాంబాబు నాయక్ అన్నారు.