
దాసరి కుమారుడి ఇంట్లో భారీ చోరీ!
మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్ నివాసంలో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది.
బంజారాహిల్స్ (హైదరాబాద్): మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్ నివాసంలో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72 భారతీయ విద్యాభవన్ స్కూల్ ఎదురుగా నివసించే అరుణ్‌కుమార్ కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లారు.
గురువారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బెడ్‌రూం అంతా చిందరవందరగా పడి ఉండటమే కాకుండా బీరువాలో ఉన్న రూ.11 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ క్రై ం పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దొంగల కోసం గాలింపు చేపట్టారు.