ఏక కాలంలో రెండు చిత్రాలు | The two images simultaneously | Sakshi
Sakshi News home page

ఏక కాలంలో రెండు చిత్రాలు

Jun 13 2017 1:40 AM | Updated on Sep 5 2017 1:26 PM

ఏక కాలంలో రెండు చిత్రాలు

ఏక కాలంలో రెండు చిత్రాలు

సాధారణంగా చిత్రం తరువాత చిత్రం చేసే విజయ్‌ఆంటోని ఏకకాలంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.

సాధారణంగా చిత్రం తరువాత చిత్రం చేసే విజయ్‌ఆంటోని ఏకకాలంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈయన నటించిన పిచ్చైక్కారన్‌ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విశేష ప్రేక్షకాదరణ చూరగొన్న విషయం తెలిసిందే. ఆ తరువాత నటించిన సైతాన్‌ ఆ స్థాయి విజయం కాకపోయినా సక్సెస్‌ అనిపించుకుంది. తాజాగా అన్నాదురై అనే చిత్రంలో నటిస్తున్నారు. రాజకీయ థ్రిల్లర్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. దర్శకుడు సుశీంద్రన్‌ శిష్యుడు శ్రీనివాసన్‌ మెగాఫోన్‌ పట్టిన ఈ చిత్రాన్ని నటి రాధిక రాడాన్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది.

విజయ్‌ఆంటోని తెలుగు మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో పాటు విజయ్‌ఆంటోని కాళీ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇంతకు ముందు వణక్కం చెన్నై చిత్రాన్ని తెరకెక్కించిన కృతిక ఉదయనిధిస్టాలిన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాల్లో  విజయ్‌ఆంటోనితో రొమాన్స్‌ చేసే కథానాయికలెవరన్న విషయాన్ని చిత్ర వర్గాలు గోప్యంగా ఉంచడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement