సస్పెన్స్ థ్రిల్లర్ | the suspense thriller new movie | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ థ్రిల్లర్

Mar 29 2014 12:58 AM | Updated on Sep 2 2017 5:18 AM

సస్పెన్స్ థ్రిల్లర్

సస్పెన్స్ థ్రిల్లర్

ఒక్క రోజులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం కడవుల్ పాది మిరుగం పాది అని దర్శకుడు రాజ్ తెలిపారు.

ఒక్క రోజులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం కడవుల్ పాది మిరుగం పాది అని దర్శకుడు రాజ్ తెలిపారు. ఇంతకు ముందు అన్వర్, పైసా పైసా తదితర మలయాళ చిత్రాలను నిర్మించి ఈయన తొలిసారిగా తన సినిప్స్ అండ్ రెడ్ కార్పెట్, బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం కడవుల్ పాది మిరుగం పాది.
 
  ఈ చిత్రం వివరాలను ఆయన వెల్లడిస్తూ, ఇది ఒక రోడ్డులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. చెన్నై-హైదరాబాద్ ఓల్డ్ హైవేలో ఒక రోజు రాత్రి ప్రారంభమై, మరుసటి రోజు రాత్రి ముగిసే సంఘటనల సమాహారమే చిత్ర కథ అని తెలిపారు. ఒక ప్రేమ జంట, పోలీసులు, ఒక విచిత్ర వ్యక్తి మధ్య నడిచే కథే కడవుల్ పాది మిరుగంపాది చిత్రం అని వివరించారు. చిత్రంలో ఆ విచిత్ర వ్యక్తి పాత్రను తానే పోషిస్తున్నానని, ప్రేమ జంటగా అభిషేక్, మిస్ ఇండియా శ్వేతా విజయ్ నటిస్తున్నారని తెలిపారు. రాహుల్ రాజ్ సంగీ తాన్ని కిషోర్ మణి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత రాజ్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement