సమాజ శ్రేయస్సు కోసం... | The Bells telugu new movie | Sakshi
Sakshi News home page

సమాజ శ్రేయస్సు కోసం...

Jan 3 2015 11:26 PM | Updated on Aug 20 2018 8:20 PM

సమాజ శ్రేయస్సు కోసం... - Sakshi

సమాజ శ్రేయస్సు కోసం...

అన్యాయాలను ఎదిరించి, సమాజ శ్రేయస్సు కోసం యువతరం ఏం చేశారనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం

అన్యాయాలను ఎదిరించి, సమాజ శ్రేయస్సు కోసం యువతరం ఏం చేశారనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ది బెల్స్’. రాహుల్, నేహా దేశ్‌పాండే జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ వాల్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ  ‘‘మూడు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ నెల 5న చిత్రీకరణ మొదలుపెట్టి 16 లోపు ఈ మూడు పాటల చిత్రీకరణ పూర్తి చేస్తాం. కాసర్ల శ్యామ్ చక్కని స్వరాలందించారు. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement