సల్మాన్ ఎందుకు వద్దంటున్నాడు..? | that's why she not pair with salman khan | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఎందుకు వద్దంటున్నాడు..?

Feb 22 2014 11:22 PM | Updated on Sep 2 2017 3:59 AM

సల్మాన్ ఎందుకు  వద్దంటున్నాడు..?

సల్మాన్ ఎందుకు వద్దంటున్నాడు..?

పస్తుతం బాలీవుడ్‌లో నంబర్‌వన్ హీరోయిన్ ఎవరు? అంటే... టక్కున వచ్చే సమాధానం దీపికా పదుకొనే.

 పస్తుతం బాలీవుడ్‌లో నంబర్‌వన్ హీరోయిన్ ఎవరు? అంటే... టక్కున వచ్చే సమాధానం దీపికా పదుకొనే. ఈ పొడవు కాళ్ల సుందరిని తమ సినిమాల్లో కథానాయికగా నటింపజేయాలని బాలీవుడ్ దర్శక, నిర్మాతలే కాదు, హీరోలు కూడా ప్రస్తుతం ఉవ్విళ్లూరుతున్నారు.

 

కానీ.. ఓ హీరో మాత్రం ‘దీపికానా? నో.. నో.. నో.. నా సినిమాలో ఆ అమ్మాయిని హీరోయిన్‌గా అంగీకరించలేను’ అని సూటిగా చెప్పేసి బాలీవుడ్‌లో పెద్ద చర్చకే తెరలేపారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? కండలవీరుడు సల్మాన్‌ఖాన్. ఆయన కథానాయకుడిగా సూరజ్ బరజాత్య ఓ చిత్రం చేయనున్నారు. ఆ సినిమాలో కథానాయికగా దీపికాను అనుకున్నారు. ఆ విషయం సల్మాన్ చెవిన పడగానే... వెంటనే అభ్యంతరం తెలియజేశారట. షారుక్ ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయం అయ్యారు దీపిక.

 

రీసెంట్ సెన్సేషన్ ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’లో కూడా షారుక్, దీపికానే హీరోహీరోయిన్లు. ‘షారుక్‌ఖాన్ ప్రొడక్ట్ దీపిక’ అని బాలీవుడ్‌లో అనేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇక షారుక్‌కీ సల్మాన్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే... దీపికను సల్మాన్ పక్కన పెట్టినట్లు బాలీవుడ్ టాక్. అయితే... సల్మాన్ మాత్రం ఈ విషయంపై వివరణ ఇస్తూ ‘దీపిక ప్రజెంట్లో చాలా బిజీ హీరోయిన్. నా సినిమాకు ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉంది. ఆమెను కథానాయికగా తీసుకుంటే డేట్స్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే వద్దన్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు’’ అని చెప్పారు. మరి ఈ అంశంపై మున్ముందు ఇంకెన్ని వార్తలొస్తాయో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement