ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం! | tharun new movie lounche | Sakshi
Sakshi News home page

ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం!

Jan 10 2016 1:42 AM | Updated on Sep 28 2018 4:53 PM

ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం! - Sakshi

ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం!

లవర్‌బోయ్ ఇమేజ్‌తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ చాలా కాలం విరామం తర్వాత...........

లవర్‌బోయ్ ఇమేజ్‌తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ చాలా కాలం విరామం తర్వాత  ఓ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేశ్-గోపి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఎస్.వి.ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

తరుణ్ మాట్లాడుతూ- ‘‘తక్కువ బడ్జెట్‌లో రూపొంది, భారీ వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో ఇప్పటికే 70 శాతం షూటింగ్  పూర్తయింది. మంచి రొమాంటిక్  కామెడీ మూవీ ఇది’’ అని చెప్పారు. ‘‘ఒక అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు, ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం. అదే ఈ సినిమాలో చెబుతున్నాం’’ అని దర్శకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయిక ఓవియా, నిర్మాత ఎస్.వి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement