సూపర్‌స్టార్‌ను కలిసిన థాయ్ ప్రధాని | Thailand pm Mom Luang Rajadarasri Jayankura meets Rajinikanth in chennai | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌ను కలిసిన థాయ్ ప్రధాని

Oct 15 2016 6:59 PM | Updated on Sep 4 2017 5:19 PM

సూపర్‌స్టార్‌ను కలిసిన థాయ్ ప్రధాని

సూపర్‌స్టార్‌ను కలిసిన థాయ్ ప్రధాని

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవడానికే ప్రత్యేకంగా థాయ్‌లాండ్ నుంచి ఆ దేశ ప్రధాని చెన్నై రావడం విశేషం.

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవడానికే ప్రత్యేకంగా థాయ్‌లాండ్ నుంచి ఆ దేశ ప్రధాని చెన్నై రావడం విశేషం. రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ఆ సమయంలో కబాలి చిత్ర షూటింగ్‌కు ఆ దేశ ప్రధాని మామ్‌లుయంగ్ రాజధర్‌శ్రీ జయకుమార్ ఎంతగానో సహకరించారట.

ఆ చిత్ర షూటింగ్ సమయంలో కలిగిన స్నేహం కారణంగాథాయ్‌లాండ్ దేశ ప్రధాని శుక్రవారం రజనీకాంత్‌ను కలవడానికి ప్రత్యేకంగా చెన్నై వచ్చారు. రజనీకాంత్‌ను ఆయన స్వగృహంలో కలిసి యోగ క్షేమాలను అడిగి ముచ్చటించారు. థాయ్‌లాండ్‌లో సూపర్‌స్టార్‌కు పెద్ద సంఖ్యలో అభిమానగణం ఉన్నారని ప్రధాని రాజధర్‌శ్రీ జయకుమార్ పేర్కొన్నారు. థాయ్‌లాండ్ ప్రధాని రజనీకాంత్‌ను కలిసినప్పుడు ఆయనతో పాటు ఎస్.క్రియేషన్స్ సీఈఓ పరంధామన్ థాను కుడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement