
టెన్త్ క్లాస్‌లోనే గుడ్‌బై చెప్పా: రకుల్ ప్రీత్ సింగ్
నా చిన్నతనంలో క్రాకర్స్ చాలా ఇష్టంగా కాల్చేదాన్ని.
నా చిన్నతనంలో క్రాకర్స్ చాలా ఇష్టంగా కాల్చేదాన్ని. టెన్త్‌క్లాస్‌లో మాత్రం వీటికి గుడ్‌బై చెప్పేశా. ఎందుకంటే వీటిని పేల్చడం వల్ల ఎంత ఆనందం కలుగుతుందో, అంతకు మించిన అనర్ధాలు కూడా ఉంటాయి. ఆ వాస్తవం అప్పుడే తెలుసుకున్నా. అప్పటి నుంచీ వాటి జోలికి వెళ్లలేదు. ఏడాదికోసారి ఈ పండగ పేరుతో క్రాకర్స్ కాలిస్తే పర్యావరణానికి చాలా నష్టం.
పైగా మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే జంతువులకు కూడా హాని జరుగుతుంది. జంతువులతో పాటు మనకు కూడా దుష్ఫలితాలు సంభవిస్తాయి. అయినా ఎవరూ వీటి గురించి దృష్టి పెట్టడం లేదు. నేనైతే దీపావళిని ఆస్వాదిస్తాను కానీ, క్రాకర్స్ కాల్చను. మరి మీరు కూడా కాలుస్తారో లేదో మీ ఇష్టం.