ఎన్‌టీఆర్‌కు సుమ గ్రీన్‌ చాలెంజ్‌

Telugu Anchor Suma Kanakala Nominate NTR for Green Challenge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ హీరో ఎన్‌టీఆర్‌కు యాంకర్‌ సుమ కనకాల గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. హరిత ఉద్యమంలో భాగంగా సినీనటి జయసుధ చేసిన సవాల్‌ను స్వీకరించిన సుమ బుధవారం బేగంపేటలో మొక్కలు నాటారు. అశోక, వేప, కదంబం మొక్కలు నాటిన ఆమె ఎన్‌టీఆర్‌తో పాటు నటి మంచులక్ష్మీ, బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విజేత రాహుల్, బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్‌లకు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. కాగా, హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ గ్రీన్‌ చాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటారు. అంతేకాకుండా వారు మరికొంత మందికి గ్రీన్‌ చాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. (చదవండి: విజయ్‌ దేవరకొండకు గ్రీన్‌ చాలెంజ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top