'పింక్' మీదే తాప్సీ ఆశలు | Tapsee Hopes On Pink | Sakshi
Sakshi News home page

'పింక్' మీదే తాప్సీ ఆశలు

Sep 15 2016 7:17 AM | Updated on May 28 2018 4:05 PM

'పింక్' మీదే తాప్సీ ఆశలు - Sakshi

'పింక్' మీదే తాప్సీ ఆశలు

తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, ఇక్కడ గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయింది. సౌత్ ఇండస్ట్రీలో చాలా రోజుల పాటు సక్సెస్ కోసం...

తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, ఇక్కడ గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయింది. సౌత్ ఇండస్ట్రీలో చాలా రోజుల పాటు సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ ఢిల్లీ బ్యూటికి లక్ కలిసి రాకపోవటంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్లో కూడా వరుసగా అవకాశాలు వస్తున్న నటిగా గుర్తింపు తీసుకువచ్చే పాత్రలు మాత్రం ఇంత వరకు చేయలేదు.

తాజాగా పింక్ సినిమాతో అలాంటి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చిన తాప్సీ, పింక్ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించనుంది. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్తో కలిసి నటిస్తుండటంపై కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది ఈ బ్యూటి. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాతో అయినా తాప్సీకి స్టార్ స్టేటస్ అందుతుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement