సింగర్‌గా మారిన మరో యంగ్ హీరో | Tanish turns playback singer for Desadimmari | Sakshi
Sakshi News home page

Feb 22 2018 1:06 PM | Updated on Feb 22 2018 4:18 PM

Young Hero Tanish - Sakshi

యువ నటుడు తనీష్‌

బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తనీష్ తరువాత హీరోగానూ కొన్ని సినిమాల్లో కనిపించాడు. అయితే కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు రాకపోవటంతో ఇటీవల నక్షత్రం సినిమాతో విలన్‌గా మారాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా తనీష్‌కు సక్సెస్‌ ఇవ్వలేదు. 

ప్రస్తుతం దేశ దిమ్మరి అనే సినిమాలో నటిస్తున్నాడు తనీష్‌. ఇప్పటికే హీరో నుంచి విలన్‌ గా మారిన తనీష్‌ ఈ సినిమాతో సింగర్‌ గా మారుతున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నగేష్‌ నారదాసి దర్శకుడు. నవీన క్రియేషన్స్‌ బ్యానర్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement