తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

Tammareddy Bharadwaja Mother Krishnaveni Pass away - Sakshi

ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుది శ్వాస విడిచారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే. రవీంద్ర ఆర్ట్స్‌ పతాకంపై ‘లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్‌ బాబు’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు కృష్ణమూర్తి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్‌ బాబు చనిపోయారు.

చిన్న కుమారుడు భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు. మొదటి నుంచి వీరిది వామపక్ష భావాలున్న కుటుంబం. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న నా మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నందున నన్ను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దు’’ అని కోరారు. కాగా కృష్ణవేణి మరణ వార్త లె లుసుకున్న చిరంజీవి ఫో¯Œ లో తమ్మారెడ్డి భరద్వాజను పరామర్శించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top