శ్రుతిమించుతున్న అభిమానం | Tamil star Hero Ajith answer to heart attack rumours | Sakshi
Sakshi News home page

శ్రుతిమించుతున్న అభిమానం

Oct 27 2015 11:13 AM | Updated on Sep 3 2017 11:34 AM

శ్రుతిమించుతున్న అభిమానం

శ్రుతిమించుతున్న అభిమానం

కోలీవుడ్ సినీ అభిమానుల మధ్య ఉన్న విభేదాలు శ్రుతి మించుతున్నాయి. ఇన్నాళ్లు సినిమాల రిలీజ్ సమయంలో విమర్శలతో సరిపెట్టుకునే స్టార్ హీరోల అభిమానులు తాజాగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో హీరోలను...

కోలీవుడ్ సినీ అభిమానుల మధ్య ఉన్న విభేదాలు శ్రుతి మించుతున్నాయి. ఇన్నాళ్లు సినిమాల రిలీజ్ సమయంలో విమర్శలతో సరిపెట్టుకునే స్టార్ హీరోల అభిమానులు తాజాగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో హీరోలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్కు ఎదురైంది. కోలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్కు పోటీ పడుతున్న అజిత్ను ఇతర హీరోల ఫ్యాన్స్ పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం 'వేదలం' సినిమా పనుల్లో బిజీగా ఉన్న అజిత్కు తీవ్ర గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.

అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసిన ఆకతాయిలు, ఆ అకౌంట్ ద్వారా అజిత్కు హార్ట్ ఎటాక్ అంటూ ప్రచారం చేశారు. అయితే వెంటనే స్పందించిన సురేష్ చంద్ర, అది తన అకౌంట్ కాదని వివరణ ఇచ్చినా అప్పటికే ఆ వార్తను చాలామంది ఫ్యాన్స్ షేర్ చేయడంతో కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీస్లకు ఫిర్యాదు చేసిన సురేష్, ఈ ప్రచారం మొదలుపెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అభిమానుల ఆందోళనను గమనించిన అజిత్.. తన వేదలం సినిమా ఫైనల్ ఎడిటింగ్ జరగుతున్న స్టూడియోలో అభిమానులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. దీంతో అభిమానులు అజిత్ ఆరోగ్యం విషయమై వచ్చిన వార్తలు ఏవీ నిజం కాదని ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement