యస్‌ 25

Tamil film directors celebrate Shankar's 25 years in the industry  - Sakshi

ఇండియన్‌ స్క్రీన్‌పై టెక్నాల జీని, భారీ హంగును చూపించిన దర్శకుడు శంకర్‌. భారీ ఖర్చుతో భారీ చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరు. ఆయన ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు మిస్కిన్‌ సర్‌ప్రైజ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కోలీవుడ్‌ దర్శకులు మణిరత్నం, కరుణాకరన్, గౌతమ్‌ మీనన్, లింగుస్వామి, బాలాజీ శక్తివేల్, పాండీరాజ్, అట్లీ, వసంత్‌ బాలన్, పా. రంజిత్‌ పాల్గొన్నారు. అందరూ ‘యస్‌ 25’ అనే లోగో ముద్రించి ఉన్న బ్లూ కలర్‌ టీ షర్ట్స్‌ను ధరించారు. స్పెషల్‌గా డిజైన్‌ చేయించిన కేక్‌ను శంకర్‌ కట్‌ చేశారు.
∙మణిరత్నం, మిస్కిన్, శంకర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top