ఆ ఒక్కటి తప్ప..

Tamannaah Rejects Big Projects For a Reason Liplock - Sakshi

సినిమా: ఈ తరం హీరోయిన్లు అందాలారబోతకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. లిప్‌లాక్‌ సన్నివేశాల్తోనూ నటించడంలో తప్పేంటి అంటున్నారు.  ఇక నటి తమన్నా విషయానికి వస్తే, ఈ అమ్మడు పూర్తిగా గ్లామర్‌నే నమ్ముకుని వచ్చింది. తొలుత హిందీలో ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌ల్లోనే అవకాశాలు వరుసకట్టడంతో దక్షిణాది పరిశ్రమనే ఆశాజనకంగా ఉండడంతో ఇక్కడి చిత్రాలపైపే దృష్టి సారించింది. మొదటి నుంచి గ్లామర్‌నే నమ్ముకున్న ఈ గుజరాతీ బ్యూటీ దానితోనే స్టార్‌ హీరోయిన్‌ అంతస్తుకు ఎదిగింది. అలాంటిది బాహుబలి చిత్రంలో వీరనారి అవంతిక పాత్రలో చాలా మంచి అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. అయినాగానీ ఆ తరువాత అలాంటి నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు ఈ అమ్మడిని వరించలేదు. దీంతో తన గ్లామర్‌ పంథాలోనే పయనిస్తోంది. అలాంటిది ఇటీవల ఒక భారీ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించాలనే ఆఫర్‌ వచ్చిందట.

అందుకు అదనంగా పారితోషికాన్ని కూడా చెల్లించడానికి నిర్మాతలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అందాలారబోతకు ఎంత దాకా అయినా వెళ్లడానికి రెడీ, ఈత దుస్తులు ధరించడానికీ రెడీ, కానీ లిప్‌లాక్‌ సన్నివేశాల్లో పారితోషికం ఎంత ఇస్తానన్నా నటించనని ఖరాఖండీగా చెప్పేసిందట. కొందరు నటీమణులు ముద్దు సన్నివేశాలే కాదు, నగ్న సన్నివేశాల్లోనూ నటించడానికి రెడీ అని గేట్లెత్తేస్తుంటే తమన్నా మాత్రం ఆ ఒక్కటీ తప్ప అనడం సినీ వర్గాలను విస్మయం పరుస్తున్నా, ఆమె అభిమానులు మాత్రం ప్రశంసిస్తున్నారట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డిలో చిరంజీవికి జంటగా నయనతార నటిస్తున్నా, తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రపై మిల్కీబ్యూటీ చాలా ఆశలు పెట్టుకుంది. బాహుబలి చిత్రానికి ముందు, ఆ తరువాత కూడా గ్లామర్‌ పాత్రల్లోనే నటించాల్సి వస్తున్న తమన్నాకు సైరా చిత్రంలో మరోసారి నటనకు అవకాశం ఉన్న పాత్ర అట. దీంతో బాహుబలి చిత్రంలో ఎంత పేరు వచ్చిందో, సైరారోనూ అంత మంచి పేరు వస్తుందనే నమ్మకంతో ఉంది. ఈ చిత్రం తనకు రెట్టింపు సంతోషాన్ని కలిగించిందని, సైరాలో నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించడం సంతోషం అయితే నయనతారతో కలిసి నటించడం రెట్టింపు సంతోషం అని తమన్నా పేర్కొంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సుందర్‌.సీ దర్శకత్వంలో విశాల్‌కు జంటగా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top