నేను చాలా తప్పులు చేశా.. | Tamannaah Bhatia Special Interview on Vishal Action Movie | Sakshi
Sakshi News home page

నాది సక్సెస్‌ పయనం కాదు!

Published Wed, Oct 23 2019 8:08 AM | Last Updated on Wed, Oct 23 2019 8:08 AM

Tamannaah Bhatia Special Interview on Vishal Action Movie - Sakshi

సినిమా: తన సినీ పయనం సక్సెస్‌ఫుల్‌ కాదని నటి తమన్నా అంటోంది. ఇటీవల తెలుగులో చిరంజీవితో కలిసి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటనకు గానూ మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తమిళంలో నటించిన పెట్రోమ్యాక్స్‌ చిత్రం కూడా సక్సెస్‌ కావడంతో చాలా హుషారుగా ఉంది. ఈ సందర్భంగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకు నటి శ్రీదేవి పాత్రలో నటించాలన్నది కోరిక అని పేర్కొంది. ఆమెను తాను ఎప్పుడూ ఒక యువ నటిగానే చూశానని చెప్పింది. శ్రీదేవి బయోపిక్‌ను ఎవరైనా చిత్రంగా రూపొందిస్తే అందులో ఆమె పాత్రలో నటించాలని ఆశ పడుతున్నట్లు పేర్కొంది. నిజం చెప్పాలంటే తన సినీ పయనం సక్సెస్‌ఫుల్‌ కాదని అంది. తానూ చాలా తప్పులు చేశానని, అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పింది.

మరో విషయం ఏమిటంటే ఎవరికీ  విజయం మాత్రమే లక్ష్యం కాదని అంది. కఠిన శ్రమ లేకుంటే ఎవరూ నూరు శాతం సాధించలేరని అంది. అదేవిధంగా సుస్థిరత చాలా ముఖ్యం అని పేర్కొంది. సమీపంలో తాను నటించిన పెట్రోమ్యాక్స్‌ చిత్రం విడుదలై ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతోందని చెప్పింది. ఇది తెలుగులో హిట్‌ అయిన ఆనందోబ్రహ్మ చిత్రానికి రీమేక్‌ అని తెలిపింది. తనలోని నటనా ప్రతిభను వెలికి తీసే ఎలాంటి పాత్రనైనా తాను సంతోషంగా నటిస్తానని చెప్పింది. తన దృష్టిలో సైరా నరసింహారెడ్డి చిత్రం అయినా, దేవీ–2 చిత్రం అయినా ఒకటేనంది. ప్రేక్షకులు అదే దృష్టితో చూడాలని కోరుకుంటున్నానంది. వినోదంతో కూడిన హర్రర్‌ చిత్రాల్లో నటించాలన్నది తన ఆశ కాకపోయినా తెలుగు చిత్రం ఆనందోబ్రహ్మ చూసిన తరువాత తన అభిప్రాయం మారిందని చెప్పింది. అందుకే ఆ చిత్ర తమిళ రీమేక్‌లో నటించే అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకున్నట్లు తమన్న పేర్కొంది. పెట్రోమ్యాక్స్‌ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు నటించారని, అందులో తానూ ఒకరినని అంది.  తనను దృష్టిలో పెట్టుకుని ఆ చిత్ర కథను తయారు చేయలేదని చెప్పింది. తాను ఎప్పుడూ బడ్జెట్‌ చిత్రాలు, స్టార్స్‌ చిత్రాలు అన్న తారతమ్యాన్ని చూపలేదని తెలిపింది. అదే విధంగా రీమేక్‌ చిత్రాల్లో నటించడానికి తనకెలాంటి సందేహం గానీ, భయంగానీ ఉండదని చెప్పింది. రీమేక్‌ చిత్రాలంటే కచ్చితంగా పోల్సి చూస్తారని, అయితే చిత్ర యూనిట్‌ అంతా కలిసి ఒరిజినల్‌ చిత్రానికి న్యాయం చేసేలా పెట్రోమ్యాక్స్‌ చిత్రాన్ని కృషి చేసినట్లు తమన్నా పేర్కొంది.

విశాల్‌కు జంటగా నటించిన యాక్షన్‌ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుందని, ప్రస్తుతం ఒక మలమాళ చిత్రంతో పాటు గోపీ సుందర్‌ దర్శకత్వంలో ఒక క్రీడా ఇతివృత్తంతో కూడిన కథా చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం పలు కథలను వింటున్నట్లు తమన్నా తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement