చైతూ కల్యాణంలో తమన్నా? | Sakshi
Sakshi News home page

చైతూ కల్యాణంలో తమన్నా?

Published Mon, Aug 8 2016 11:57 PM

చైతూ కల్యాణంలో తమన్నా?

సమంత పోయె రకుల్ వచ్చె.. రకుల్ పోయె తమన్నా వచ్చె డుమ్ డుమ్ డుమ్. ఇది చదవగానే ఈ ముద్దుగుమ్మలు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి పోయారు? అని ఆలోచనలో పడ్డారా? మరేం లేదు. నాగచైతన్య హీరోగా నటించనున్న తాజా చిత్రంలో ముందుగా సమంతను నాయికగా తీసుకున్నారనే వార్త వినిపించింది. ఆ తర్వాత రకుల్ పేరు సీన్లోకొచ్చింది. ఇప్పుడు తమన్నా పేరు వినిపిస్తోంది.

 ఇక ఈ చిత్రానికి సంబంధించినంతవరకూ మరో కథానాయిక పేరు వినిపించదనీ, తమన్నాని ఫైనలైజ్ చేసేశారని సమాచారం. ‘100% లవ్’, ‘తడాఖా’ చిత్రాల్లో చైతు, తమన్నా జోడీ చూడచక్కగా ఉంటుంది.  ఈ రెండూ హిట్ సినిమాలే. ఒకవేళ మూడోసారి కూడా జతకట్టి, ఆ సినిమా హిట్ అయితే అప్పుడు ఈ ఇద్దరూ ‘హ్యాట్రిక్’ సాధించినట్లవుతుంది. నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దీనికి ‘కల్యాణం’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement