అందమైన అమ్మాయి చీర కడితే... పండువెన్నెల్లా ఉంటుంది. ఉదాహరణకు నా లాంటి అమ్మాయి అన్నమాట’’ అని ధీమాగా చెబుతున్నారు తమన్నా.

‘‘అందమైన అమ్మాయి చీర కడితే... పండువెన్నెల్లా ఉంటుంది. ఉదాహరణకు నా లాంటి అమ్మాయి అన్నమాట’’ అని ధీమాగా చెబుతున్నారు తమన్నా. ఈ మిల్కీబ్యూటీకి చీరంటే వల్లమాలిన అభిమానమట. ఇటీవల చీర గురించి తమన్నా మాట్లాడుతూ -‘‘గ్లామర్ ప్రపంచంలో ట్రెండీగా ఉండటం తప్పని సరి. అందుకనే ఎక్కువగా మోడ్రన్ డ్రస్సుల్లోనే ఉంటాం. కానీ పండుగలు, పబ్బాలు వచ్చాయంటే మాత్రం ఆలోచించకుండా... చీరలోకి దూరిపోతాను.
చీరలంటే నాకు ఎంత ఇష్టమంటే... మార్కెట్‌లో కొత్తరకం చీరలేమైనా కనిపించాయంటే... ముందు వాటిని కొనేయాల్సిందే. ప్రైవేటు ఫంక్షన్లకు ఎక్కువశాతం చీరలోనే ఎటెండ్ అవుతుంటాను. అయితే... స్త్రీకి చీరే అందం అనే వ్యాఖ్యానంతో మాత్రం నేను ఏకీభవించను. ఎందుకంటే... కొంతమంది చీరకడితే... ఆ చీరకున్న అందం చెడుతుంది. అందుకే చీరను కట్టే స్త్రీ కూడా శిల్పంలా ఉండాలి. నిజానికి చీరలో నేను చాలా బాగుంటాను. మోడ్రన్ ట్రెండ్‌కి అలవాటు పడ్డా... చీర ఇచ్చేంత గ్లామర్ నాకు ఏ దుస్తులూ ఇవ్వవు’’ అని చెప్పారు తమన్నా.