విరాట్‌తో ఎఫైర్‌.. స్పందించిన తమన్నా

Tamanna Breaks Silence About Virat Kohli Issue - Sakshi

మిల్కీబ్యూటీగా తన అందం, నటనతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది తమన్నా. చాలాకాలం తరువాత ‘ఎఫ్‌2’ రూపంలో ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది తమన్నా. ఈ సినిమాతో మళ్లీ ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చేసింది తమన్నా. ఈ మూవీ హిట్‌ కావడంతో మరికొన్ని ప్రాజెక్ట్‌లు తమన్నాను వరించాయి.

అయితే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో విరాట్‌తో ఎఫైర్‌పై ప్రశ్నలు వేయగా.. ఆ విషయంపై మొదటిసారిగా తమన్నా స్పందించింది. తాను విరాట్‌ కోహ్లీతో కలిసి గతంలో ఓ యాడ్‌లో పనిచేశానని. అటు తరువాత మళ్లీ విరాట్‌ను ఇంతవరకు కలవలేదని, తనతో ఎలాంటి సంబంధం లేదని, డేటింగ్‌ చేయలేదని సమాధానమిచ్చారు. తమన్నా ప్రస్తుతం మహాలక్ష్మీ (క్వీన్‌ రీమేక్‌)తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top