సంజయ్ బయోపిక్లో సీనియర్ హీరోయిన్ | Tabu to have a cameo in Sanjay Dutt biopic | Sakshi
Sakshi News home page

సంజయ్ బయోపిక్లో సీనియర్ హీరోయిన్

Aug 17 2017 3:47 PM | Updated on Sep 17 2017 5:38 PM

సంజయ్ బయోపిక్లో సీనియర్ హీరోయిన్

సంజయ్ బయోపిక్లో సీనియర్ హీరోయిన్

స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో రణబీర్ కపూర్ సంజయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పరేశ్ రావల్, మనీషా కొయిరాలా, సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్క శర్మ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా ఈ భారీ చిత్రంలో నటించేందుకు మరో స్టార్ హీరోయిన్ అంగీకరించింది.

సీనియర్ బాలీవుడ్ స్టార్ టబు సంజయ్ బయోపిక్ లో అతిథి పాత్రలో కనిపించనుంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లోనే రీల్ లైఫ్ లోనూ నటించనుంది. 2004లో మున్నాభాయ్ ఎంబీబీయస్ సినిమాకు గానూ టబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు సంజయ్. ఇప్పుడు అదే సీన్ కోసం అతిథి పాత్రలో నటించేందుకు టబు అంగీకరించింది. అంతేకాదు ఆ రోజు అవార్డ్ ఫంక్షన్ లో కట్టుకున్న అదే చీరతో సినిమాలో నటించనుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement