‘నో’ చెబితే ఫీలైపోతారు! | Taapsee Pannu: No Second Chances for Outsiders in Bollywood | Sakshi
Sakshi News home page

‘నో’ చెబితే ఫీలైపోతారు!

Apr 17 2015 10:52 PM | Updated on Aug 13 2018 3:04 PM

‘నో’ చెబితే ఫీలైపోతారు! - Sakshi

‘నో’ చెబితే ఫీలైపోతారు!

‘‘ఏ రంగంలో అయినా పోటీ సహజం. కానీ, సినిమా రంగంలో...

‘‘ఏ రంగంలో అయినా పోటీ సహజం. కానీ, సినిమా రంగంలో ఈ పోటీ అధికం. సినిమాకో కథానాయిక పరిచయం అవుతుండటంతో, అప్పటికే ఉన్న తారలతో పాటు కొత్త తారల నుంచి పోటీ ఎక్కువ అవుతోంది’’ అని తాప్సీ అంటున్నారు. ప్రధానంగా హిందీ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ వాఖ్యలు చేశారు. హిందీ రంగం గురించి తాప్సీ ఇంకా మాట్లాడుతూ -‘‘ఇక్కడ పోటీ ఎక్కువ. దాంతో పాటు విమర్శలూ ఎక్కువే. ఆ విమర్శల కారణంగా ఒక్కోసారి ఆత్మస్థయిర్యం కోల్పోయే ప్రమాదం ఉంది.

అందుకే విమర్శలను మనసు వరకూ తీసుకెళ్లకూడదని బలంగా నిర్ణయించుకున్నా’’ అన్నారు. బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తారలు హిందీలో ఎక్కువే అని చెబుతూ -‘‘నాలాంటి అప్ కమింగ్ తారలు సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తే అదేదో వింతలా భావిస్తారు. ఏదైనా సినిమాకి ‘నో’ అంటే చాలు, ఫీలైపోతారు. కానీ, ఏ సినిమా పడితే అది చేస్తే కెరీర్ ఎలాగోలా అయిపోతుంది. అందుకే, ఎవరేమనుకున్నా ఫర్వాలేదనుకుని, నా కెరీర్‌కి ఉపయోగపడుతుందనిపించే చిత్రాలు మాత్రమే అంగీకరిస్తున్నా’’ అని తాప్సీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement