రెండు నెలలు మాత్రమే!

sye raa narasimha reddy shooting completed in georgia - Sakshi

జార్జియాలో క్లైమాక్స్‌ కంప్లీట్‌ చేశారు. కీలక సన్నివేశాల కోసం మైసూర్, చెన్నై కూడా వెళ్లొచ్చారు. ఎలాగూ హైదరాబాద్‌లో మేజర్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఇదంతా... ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం గురించే. ఇంకెంతకాలం ‘సైరా’ జర్నీ కొనసాగుతుంది అంటే ఇంకా రెండు నెలలు. అంటే మార్చి ఎండింగ్‌లో ఈ చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యే అవకాశం ఉందని ఊహించవచ్చు. ఈ విషయాన్ని ఈ చిత్రనిర్మాత, హీరో రామ్‌చరణ్‌ ఓ సందర్భంలో వెల్లడించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’.

చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ సంక్రాంతి పండగ తర్వాత హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రారంభం అవుతుందని సమాచారం. సినిమాలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్‌ చేశారు ‘సైరా’ టీమ్‌. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, విజయ్‌సేతుపతి, సుదీప్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top