స్విస్‌దేవి

Switzerland to honour Sridevi with a statue - Sakshi

స్విట్జర్లాండ్‌కి, మన ఇండియన్‌ సినిమాలకు మంచి కనెక్షన్‌ ఉంది. మన హీరో హీరోయిన్లు డ్యూయెట్‌ పాడుకోవడానికి ఎక్కువగా స్విస్‌నే ప్రిఫర్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఆ స్విస్‌ ప్రభుత్వం కూడా ఇండియన్‌ సినిమా అభిమానులకు, మరీ ముఖ్యంగా శ్రీదేవి అభిమానులకు ఓ గిఫ్ట్‌ ఇవ్వనున్నారు. స్విట్జర్లాండ్‌లో టూరిస్ట్‌ అట్రాక్షన్‌గా, ఎక్కువ షూటింగ్‌ జరుపుకునే ఇంటర్‌లేకెన్‌లో శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్విస్‌లో సాంగ్స్‌ షూట్‌ చేసే ట్రెండ్‌ బాలీవుడ్‌లో రాజ్‌ కపూర్‌ సినిమాలతో స్టార్ట్‌ అయింది. ఆ తర్వాత అలా కంటిన్యూ అవుతూ వస్తోంది. శ్రీదేవి నటించిన ‘చాందిని’ సినిమాలో పాటలన్నీ స్విస్‌లోనే షూట్‌ చేశారు. ఇలా ఇండియన్‌ సినిమాల షూటింగ్స్‌తో పాటు టూరిజం కూడా ఎక్కువగా ఉండటంతో స్విస్‌ దేశం ఇంతకుముందు యశ్‌ చోప్రా విగ్రహాన్ని కూడా ప్రతిష్టించింది. ఇప్పుడు శ్రీదేవి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆమెకు గౌరవం కలిగించబోతున్నారు. ఈ సంవత్సరమే బాత్‌ టబ్‌లో మునిగిపోయి శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top