థ్రిల్‌.. సస్పెన్స్‌.. హారర్‌ | Swayam Vadha Teaser Launch | Sakshi
Sakshi News home page

థ్రిల్‌.. సస్పెన్స్‌.. హారర్‌

Mar 2 2019 6:03 AM | Updated on Mar 2 2019 6:03 AM

Swayam Vadha Teaser Launch - Sakshi

ఆదిత్య, అనికా

‘‘స్వయంవద’ సినిమా మోషన్‌ పోస్టర్, టీజర్‌ బాగున్నాయి. ఇటీవలి కాలంలో హారర్‌ జోనర్‌ సినిమాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఆ కోవలోనే ఈ సినిమా కూడా విజయం సాధించాలి’’ అని నిర్మాత సి.కల్యాణ్‌ అన్నారు. ఆదిత్య అల్లూరి, అనికారావు  జంటగా  వివేక్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్వయంవద’. లక్ష్మీ చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని సి. కల్యాణ్‌ ఆవిష్కరించారు. వివేక్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘హారర్, థ్రిల్లర్, సైన్స్‌ ఫిక్షన్, సస్పెన్స్‌ అంశాల చుట్టూ కథ నడుస్తుంది.

మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అసభ్యకర సన్నివేశాలు ఉండవు. కథను నమ్ముకుని చేశాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులకు మా చిత్రం కొత్త అనుభూతిని పంచుతుంది. త్వరలో సినిమాని విడుదల చేయనున్నాం’’ అని రాజా దూర్వాసుల అన్నారు. ‘‘రాజా,  నేను ప్రొడక్షన్‌ మేనేజర్లుగా కలిసి పని చేశాం. తను మంచి స్నేహితుడు. నిర్మాతగా పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ అన్నారు. ఆదిత్య అల్లూరి, అనికా రావు, నటులు లోహిత్, రామ్‌ జగ¯Œ , నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement