పాస్‌పోర్ట్‌ తిప్పలు! | Swathi Reddy bags next flick ‘London Babulu’ | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్‌ తిప్పలు!

Aug 15 2017 11:58 PM | Updated on Sep 17 2017 5:33 PM

పాస్‌పోర్ట్‌ తిప్పలు!

పాస్‌పోర్ట్‌ తిప్పలు!

‘జీవితాన్ని సినిమా పెద్దగా చూపిస్తే, టీవీ చిన్నగా చూపెడుతుంది. కానీ, జీవితాన్ని జీవితంగా చూపెట్టేది నాటకం మాత్రమే.

‘‘జీవితాన్ని సినిమా పెద్దగా చూపిస్తే, టీవీ చిన్నగా చూపెడుతుంది. కానీ, జీవితాన్ని జీవితంగా చూపెట్టేది నాటకం మాత్రమే. ఈ టీజర్, సాంగ్‌ చూస్తుంటే నాకు నాటకాల్లో పనిచేసిన రోజులు గుర్తుకొచ్చాయి. నిర్మాతగా మారుతిగారు నాకు ఇన్‌స్పిరేషన్‌. కొత్త కాన్సెప్ట్‌ సినిమాలు ఆడితేనే కొత్త వారు ఇండస్ట్రీకి రావడానికి ఆసక్తి చూపిస్తారు’’ అని దర్శకుడు హరీష్‌ శంకర్‌ అన్నారు.

రక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో ఏవీఎస్‌ స్టూడియో సమర్పణలో దర్శకుడు మారుతి నిర్మిస్తున్న చిత్రం ‘లండన్‌ బాబులు’. కె. సంగీతం అందించిన ఈ సినిమాలోని తొలి పాటను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హరీష్‌ శంకర్, స్పెషల్‌ టీజర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ– ‘‘పాస్‌పోర్ట్‌ కోసం పడే తిప్పల్ని ఈ చిత్రంలో చెప్పాం. స్వాతిలో మంచి రైటర్, డైరక్టర్‌ కూడా ఉన్నారు. తనకి కథ నచ్చి, చేస్తాననగానే హ్యాపీగా అనిపించింది.

ఈ సినిమా రెగ్యులర్‌గా ఉండదు. నేను నిర్మించే సినిమాలకు పేరు వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. కానీ, ఈ చిత్రం బాగా నచ్చడంతో పేరు వేసుకున్నా’’ అన్నారు. ‘‘లండన్‌ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథే ఈ చిత్రం’’ అన్నారు చిన్నికృష్ణ. రక్షిత్, స్వాతి, ఎ.వి.ఎస్‌. ప్రకాశ్, మల్లిక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కిరణ్‌ తలసిల, దాసరి వెంకట సతీష్‌.

Advertisement
 
Advertisement
Advertisement