బానిసనయ్యాను అందుకే దూరంగా ఉంటున్నాను

Swara Bhasker Deactivate Twitter Due Trolling - Sakshi

ప్రతి విషయం గురించి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే నటి, బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ స్వర భాస్కర్‌ కొద్ది రోజులుగా కనిపించడం లేదు.. అంటే ట్విటర్‌లో కనిపించడం లేదని. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ.. నిఖచ్చిగా మాట్లాడుతూ.. నెటిజన్ల విమర్శలు ఎదుర్కొనే స్వర భాస్కర్‌ కొద్ది రోజులుగా ట్విటర్‌లో కనిపించడం లేదు. దాంతో ట్రోలర్స్‌కి భయపడి స్వర తన ట్విటర్‌ అకౌంట్‌ను డియాక్టివేట్‌ చేసిందనే వార్తలు షికారు చేస్తున్నాయి.

అయితే ఈ విషయంపై స్వయంగా స్పందించారు స్వర భాస్కర్‌. ‘ప్రస్తుతం నేను యూరోప్‌ టూర్‌లో ఉన్నాను. వచ్చేవారం ఇండియాకు తిరిగి వస్తాను. ఈ సెలవులను ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అంతేకాక ఈ మధ్య నేను ట్విటర్‌కు బాగా అడిక్ట్‌ అయినట్లు అన్పిస్తోంది.అందుకే ట్విటర్‌కు దూరంగా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపారు.

కానీ గాసిప్‌ రాయుళ్లు మాత్రం ‘ఈ 30 ఏళ్ల నటి నోటికి అడ్డు అదుపూ లేకుండా మాట్లాడ్తది. దాంతో స్వరకు, ఆమె హేటర్స్‌కు మధ్య ఇప్పటికే చాలాసార్లు గొడవలు జరిగాయి. వీటన్నింటి దృష్టిలోపెట్టుకునే స్వర ప్రస్తుతం ట్విటర్‌కు దూరంగా ఉంటుందనే’ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కానీ స్వర మాత్రం ఈ వార్తలు వాస్తవం కాదంటున్నారు. ప్రస్తుతం స్వర ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సైట్లలో యాక్టీవ్‌గానే ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top