తలవంచదు నా పొగరు | Surya New Movie Teaser Launched By Venkatesh And Prabhas | Sakshi
Sakshi News home page

తలవంచదు నా పొగరు

Jan 8 2020 1:47 AM | Updated on Jan 8 2020 4:30 AM

Surya New Movie Teaser Launched By Venkatesh And Prabhas - Sakshi

‘జేబులో ఆరు వేలు పెట్టుకుని ఏరోప్లెయిన్‌ కంపెనీ పెడతానని ఒకడొస్తే... ఎవడ్రా ఈ పిచ్చోడని ఈ లోకం వాణ్ని చూసి నవి్వంది’ అని మోహన్‌బాబు వాయిస్‌ ఓవర్‌తో వచ్చే డైలాగ్‌తో ఆరంభమైంది ‘ఆకాశం నీ హద్దురా’! టీజర్‌. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్‌ సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘శూరరై పోట్రు’. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు సూర్య ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. రాజశేఖర్‌ కర్పూరసుందర పాండ్యన్, గునీత్‌ మోంగా, ఆలిఫ్‌ సుర్తి ఈ చిత్రానికి సహ–నిర్మాతలు. ఈ సినిమాకు తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు టీజర్‌ను మంగళవారం హీరోలు వెంకటేష్, ప్రభాస్, హీరోయిన్‌ సమంత, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, దర్శకురాలు నందినీరెడ్డి సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

‘‘గర్జనై నా అరుపు... తలవంచదు నా పొగరు.. అణచాలని నువ్వు చూసినా  కరవాలమై తిరిగి వస్తా.... అనే నేపథ్యగానంతో టీజర్‌ సాగింది. ‘పెద్ద మనుషుల బిజినెస్‌ నీకు ఎందుకయ్యా... వెళ్లి మీ ఊర్లో పందుల్ని మేపుకో...’, ‘కానీ నువ్వు ఓడిపోయినవారిలా ఇలా ఓ మూలన కూర్చుండి పోతావనుకోలేదు మహా’ , ‘బాగా కోపం ఎక్కువనుకుంటా నీకు’ అంటూ సాగే టీజర్‌లోని డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘‘1984 నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ సాధారణ వ్యక్తి ఓ అసాధారణమైన కలను ఎలా సాధించాడు? అనే అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించాం. మధ్యతరగతి యువకునిలా సూర్య నటన సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మోహన్‌బాబు, పరేష్‌ రావల్, అపర్ణా బాలమురళి, ప్రకాష్‌ బెలవాది, ఊర్వశి, కరుణాస్, వివేక్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement