‘మీరు రెచ్చగొట్టింది నిద్రపోతున్న పులిని..’ | Suriya Bandobast Teaser Out | Sakshi
Sakshi News home page

‘మీరు రెచ్చగొట్టింది నిద్రపోతున్న పులిని..’

Jul 6 2019 6:25 PM | Updated on Jul 6 2019 6:25 PM

Suriya Bandobast Teaser Out - Sakshi

గత కొన్నేళ్లుగా సూర్య చిత్రాలు సరైన విజయాన్ని నమోదు చేయలేకపోతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ఎన్‌జీకే చిత్రం కూడా ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బందోబస్త్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మళయాల సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తో కలిసి చేస్తున్న ఈ మూవీ టీజర్‌ తాజాగా విడుదలైంది.

రానా చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. ‘మీరు రెచ్చగొట్టింది నిద్రపోతున్న పులిని.. పంజా విసరడానికి ఎంతో సమయం పట్టదు’ లాంటి డైలాగ్‌లు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఆర్య, సాయేషా, బొమన్‌ ఇరానీ ముఖ్య పాత్రల్లో నటించగా.. కేవీ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు హారీస్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ ఆగస్ట్‌లో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement