రజనీ 169 ఫిక్స్‌? | Sakshi
Sakshi News home page

రజనీ 169 ఫిక్స్‌?

Published Thu, Nov 28 2019 12:35 AM

Superstar Rajinikanth to team up with Gautham Menon next Film - Sakshi

ఈ మధ్య కాలంలో రజనీ సినిమాలు చేస్తున్న స్పీడ్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఒక సినిమా రిలీజ్‌ అయిన వెంటనే మరో సినిమా సెట్స్‌ మీదకు తీసుకెళ్లడం, అది పూర్తయ్యేలోపే నెక్ట్స్‌ సినిమాకు ముహూర్తం పెట్టడం చేస్తున్నారాయన. మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీ చేసిన ‘దర్బార్‌’ సంక్రాంతికి విడుదల కానుంది. ఈలోపు దర్శకుడు శివతో ఓ సినిమా కమిట్‌ అయ్యారు రజనీ.

అది ఆయన కెరీర్‌లో 168వ సినిమా. ఈ సినిమా డిసెంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇక రజనీ 169వ సినిమాను గౌతమ్‌ మీనన్‌ డైరెక్ట్‌ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌతమ్‌ మీనన్‌ చెప్పిన కథకు రజనీ ఇంప్రెస్‌ అయ్యారట. వేల్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై గణేశ్‌ ఈ సినిమాను నిర్మిస్తారట. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేలోగా వీౖలైనన్ని సినిమాలు చేస్తాను అని ఓ సందర్భంలో చెప్పారు రజనీ. అందుకే ఈ స్పీడ్‌ అయ్యుండాలి.

Advertisement
 
Advertisement