విశాల్‌తో సన్నీలియోన్‌!

Sunny Leone Special Song in Vishal Ayogya Movie - Sakshi

తమిళసినిమా: నటుడు విశాల్‌తో సింగిల్‌ సాంగ్‌లో చిందులేయడానికి హాలీవుడ్‌ స్టన్నింగ్‌ బ్యూటీ సిన్నిలియోన్‌ సై అన్నదన్నది తాజా సమాచారం. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు. అందాలారబోతకు అగ్‌మార్క్‌ సన్ని అంటారు. బాలీవుడ్‌లో అంత శృంగారనటిగా పేరు గాంచింది.  సన్నిలియోన్‌ కోలీవుడ్‌లో చారిత్రక కథా చిత్రం వీరమహాదేవిలో టైటిల్‌ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబుతోంది. అయితే వీరమహాదేవి పాత్రలో సన్నిలియోన్‌ నటించడాన్ని తమిళ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకు వ్యతిరేకంగా ఆందోళలను చేపడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంచలన నటి నటుడు విశాల్‌తో ఐటమ్‌సాంగ్‌కు చిందేయడానికి రెడీ అవుతుండడం విశేషమే.

విశాల్‌ ప్రస్తుతం అయోగ్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తెలుగులో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన టెంపర్‌ చిత్రానికి రీమేక్‌. ఇందులో ఒక ఐటమ్‌ సాంగ్‌లో సన్నిలియోన్‌ విశాల్‌తో కలిసి అందాలు ఆరబోయనుందని సమాచారం. ఈ బ్యూటీ ఇప్పటికే కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో నటించిందన్నది గమనార్హం. కాగా మలయాళంలో సన్నిలియోన్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారన్నది గమనార్హం. ఆ మధ్య ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కేరళ వెళ్లగా అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ప్రస్తుతం అక్కడ సన్ని నటుడు మమ్ముట్టితోనూ మధురరాజా అనే చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ చేస్తోంది. దీంతో ఇప్పుడు తమిళంలో అయోగ్య చిత్రంపైనా, మలయాళంలో మధురరాజా చిత్రానికి చాలా క్రేజ్‌ పెరిగిపోయింది. త్వరలో తెరపైకి రానున్న వీరమహాదేవి చిత్రాన్ని సన్ని ఐటమ్‌ సాంగ్స్‌ వ్యవహారం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top