సారీ చెప్పిన సన్నీ లియోన్‌..!

Sunny Leone Sorry To Delhi Resident After His Phone Number Got Leaked - Sakshi

సినిమా వాళ్లు కనిపిస్తే చాలు కొందరు జనాలు మీదపడిపోతుంటారు. అలాంటిది వారి ఫోన్‌ నంబర్లు దొరికితే ఇంకేమైనా ఉందా..! వారికి వరుస ఫోన్‌కాల్స్‌, సందేశాలతో ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు. ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది. సన్నీ లియోన్‌ ఫోన్‌ నంబర్‌ లీకైందనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆ నెంబర్‌కు హాయ్‌ సన్నీలియోన్‌.. అంటూ రోజుకు వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్‌​, అసభ్యకర సందేశాలు పోటెత్తిన సంగతి తెలిసిందే.

అయితే ‘అర్జున్‌ పాటియాల’ చిత్రంలో ఓ సన్నివేశంలో తన నంబర్‌ను సన్నీ లియోన్‌ చెప్పుకొచ్చింది. అయితే అది సినిమాలోని సీన్‌ కోసం చెప్పినా.. అభిమానులు మాత్రం అదే నిజమైన నంబర్‌ అనుకుని కాల్స్‌, మెసెజ్‌లతో దండయాత్ర చేశారట. ఆ నంబర్‌ తనదంటూ.. తన అనుమతి లేకుండా ఆ చిత్రంలో తన నంబర్‌ను వాడుకున్నారని ఢిల్లీకి చెందిన పునీత్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు స్పిందించకుంటే కోర్టుకు కూడా వెళ్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో సన్నీలియోన్‌ స్పందించింది. ఒక చానెల్‌లో మాట్లాడుతూ.. ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ పునీత్‌కు క్షమాపణలు చెప్పింది. మరి సన్నీ లియోన్‌ స్పందనతో కూల్‌ అయిపోతాడో, కోర్టుకే వెళతాడో  చూడాలి మరి..!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top