ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు | SUNNY DEOL, SRIDEVI SONG REMIX FOR PAGAL PANTHI MOVIE | Sakshi
Sakshi News home page

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

Sep 1 2019 12:08 AM | Updated on Sep 1 2019 5:09 AM

SUNNY DEOL, SRIDEVI SONG REMIX FOR PAGAL PANTHI MOVIE - Sakshi

ఇలియానా

పాపులర్‌ పాటల్ని రీమిక్స్‌ చేసే ట్రెండ్‌ను కొనసాగిస్తూనే ఉంది బాలీవుడ్‌. పాత పాటలకి ట్రెండీ టచ్‌ ఇచ్చి సినిమాకు కావాల్సినంత క్రేజ్‌ తెచ్చుకుంటోంది. లేటెస్ట్‌గా రెండు పాత పాటల్ని ఒకే సినిమాలో రీమిక్స్‌ చేయాలనుకుంటున్నారు. జాన్‌ అబ్రహాం, ఇలియానా, అనిల్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘పాగల్‌ పంతీ’. అనీజ్‌ బజ్మీ దర్శకుడు.

ఈ సినిమా కోసం సన్నీ డియోల్, శ్రీదేవి నటించిన ‘చాల్‌బాజ్‌’లోని ‘తేరా బీమార్‌ మేరా దిల్‌..’ పాటను రీమిక్స్‌ చేశారట. మరో పాట ఏంటనేది ఇంకా అనౌన్స్‌ చేయలేదు. ఒరిజినల్‌ పాటలో సన్ని, శ్రీదేవి కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచినట్టు,  జాన్, ఇలియానా కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో ఓ హెలైట్‌ అవుతుందట. నవంబర్‌ 8న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement