కొత్తగా చూపించారు! | Sundeep Kishan's 'Beeruva' audio launched | Sakshi
Sakshi News home page

కొత్తగా చూపించారు!

Dec 25 2014 11:00 PM | Updated on Sep 15 2019 12:38 PM

కొత్తగా చూపించారు! - Sakshi

కొత్తగా చూపించారు!

సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా పాటల సీడీని నేనే విడుదల చేశాను. ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా అంతకు మించి విజయాన్ని సాధించాలి’’

‘‘సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా పాటల సీడీని నేనే విడుదల చేశాను. ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా అంతకు మించి విజయాన్ని సాధించాలి’’ అని దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. సందీప్‌కిషన్, సురభి జంటగా ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘బీరువా’. ఎస్.ఎస్.తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు, ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నిర్మాత రామోజీరావు ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కి అందించారు.
 
 ప్రచార చిత్రాలను రకుల్ ప్రీత్‌సింగ్ విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. తమన్ మంచి సంగీతం ఇచ్చారనీ, దర్శకుడు కణ్మణి తనను కొత్తగా చూపించాడనీ, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత మళ్లీ జెమినీ కిరణ్‌గారి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాననీ సందీప్ కిషన్ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కణ్మణి కృతజ్ఞతలు తెలిపారు. పాటలతో పాటు సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని తమన్ నమ్మకం వెలిబుచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement