breaking news
Anandi Arts
-
మూడో సినిమా
సందీప్ కిషన్ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘బీరువా’ వంటి చిత్రాలు అందించిన నిర్మాత పి. కిరణ్ సందీప్‌తోనే మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. గురువారం సందీప్ కిషన్ పుట్టినరోజుని పురస్కరించుకుని తమ కాంబినేషన్లో రూపొందనున్న మూడో సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేష¯Œ ్స పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 15గా రూపొందనున్న ఈ చిత్రానికి భాను బోగవరపు కథ అందిస్తున్నారు. అందమైన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది. -
కొత్తగా చూపించారు!
‘‘సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా పాటల సీడీని నేనే విడుదల చేశాను. ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా అంతకు మించి విజయాన్ని సాధించాలి’’ అని దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. సందీప్‌కిషన్, సురభి జంటగా ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘బీరువా’. ఎస్.ఎస్.తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు, ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నిర్మాత రామోజీరావు ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కి అందించారు. ప్రచార చిత్రాలను రకుల్ ప్రీత్‌సింగ్ విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. తమన్ మంచి సంగీతం ఇచ్చారనీ, దర్శకుడు కణ్మణి తనను కొత్తగా చూపించాడనీ, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత మళ్లీ జెమినీ కిరణ్‌గారి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాననీ సందీప్ కిషన్ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కణ్మణి కృతజ్ఞతలు తెలిపారు. పాటలతో పాటు సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని తమన్ నమ్మకం వెలిబుచ్చారు.