కేసులు ఇవ్వండి ప్లీజ్‌ 

Sundeep Kishan look from Tenali Ramakrishna BA BL unveiled - Sakshi

సందీప్‌ కిషన్‌ హీరోగా అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరున్న జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్‌ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, రూపా జగదీష్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంగళవారం సందీప్‌కిషన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

ఫస్ట్‌ లుక్‌లో సందీప్‌ కిషన్‌ లాయర్‌గా కనిపిస్తున్నారు. ‘‘ఈ చిత్రాన్ని నాగేశ్వరరెడ్డి తనదైన స్టైల్లో లాఫింగ్‌ రైడర్‌గా రూపొందిస్తున్నారు. బుధవారం నుంచి కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ఎంటైర్‌ యూనిట్‌ పాల్గొంటుంది’’ అని నిర్మాతలు తెలిపారు. బ్రహ్మానందం, మురళీశర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్‌ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సాయిశ్రీరాం, సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సీతారామరాజు మల్లెల.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top