థ్రిల్లర్ జానర్‌లో ‘ఇదం జగత్‌’!

Sumanth - Sakshi

సక్సెస్‌ కోసం చాలా కాలం ఎదురుచూసిన అక్కినేని వారసుడు సుమంత్‌ ఇటీవల మళ్ళీరావా సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్‌ను సక్సెస్‌ ట్రాక్‌ లోకి తీసుకువచ్చింది. మళ్ళీరావా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలకు ఓకె చెప్పాడు సుమంత్‌. ప్రస్తుతం అనిల్‌ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్‌. ఈ సినిమాలో ప్రేమమ్‌ ఫేం అంజు కురియెన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సుమంత్‌ ఫొటో జర్నలిస్ట్‌ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్‌ నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప‍్రచారం జరుగుతోంది. సుమంత్‌ కొత్త స్టైల్‌లో కనిపించనున్న ఈసినిమాకు ‘ఇదం జగత్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top