సుమంత్‌కి మరోవైపు... | Sumanth Idam Jagath Movie Release Details | Sakshi
Sakshi News home page

సుమంత్‌కి మరోవైపు...

Jul 19 2018 12:09 AM | Updated on Jul 19 2018 12:09 AM

Sumanth Idam Jagath Movie Release Details - Sakshi

సుమంత్‌,అంజు కురియన్‌

సుమంత్‌ సాఫ్ట్‌ హీరో. ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్‌ సుమంత్‌కి అలాంటి ఇమేజ్‌నే తెచ్చాయి. ఇప్పుడు తనలో మరో కోణం చూపించడానికి రెడీ అయ్యారు. సుమంత్‌ని నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో మనం చూడబోతున్నాం. విరాట్‌ ఫిల్మ్స్‌ అండ్‌ శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమాస్‌ పతాకాలపై అనిల్‌ శ్రీ కంఠం దర్శకత్వంలో సుమంత్‌ హీరోగా ‘ఇదం జగత్‌’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత్‌ నెగటివ్‌ షేడ్‌ రోల్‌లో కనిపించనున్నారు.

చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ తన కెరీర్‌లో చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో సుమంత్‌ కనిపించనున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ పాత్ర ఉంటుంది. ఆడియన్స్‌ కచ్చితంగా థ్రిల్‌ అవుతారు. సుమంత్‌ క్యారెక్టర్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్ట్‌ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అంజు కురియన్‌ కథానాయికగా పరిచయం కానున్న ఈ చిత్రంలో శివాజీ రాజా, ‘ఛలో’ ఫేమ్‌ సత్య, ఆదిత్యా మీనన్, కల్యాణ్, షఫీ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్, కో–ప్రొడ్యూసర్‌: మురళీకృష్ణ దబ్బుగుడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement