సులోచన అండ్‌ వండర్‌ఫుల్‌ మదర్స్‌! | Sulochana and Wonderful Mothers! | Sakshi
Sakshi News home page

సులోచన అండ్‌ వండర్‌ఫుల్‌ మదర్స్‌!

Apr 23 2017 1:04 AM | Updated on Sep 5 2017 9:26 AM

సులోచన అండ్‌ వండర్‌ఫుల్‌ మదర్స్‌!

సులోచన అండ్‌ వండర్‌ఫుల్‌ మదర్స్‌!

‘తుమ్హారీ సులు’... విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ సినిమా ఇది.

‘తుమ్హారీ సులు’... విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ సినిమా ఇది. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం ‘లగే రహో మున్నాభాయ్‌’ (తెలుగులో ‘శంకర్‌దాదా జిందాబాద్‌’గా రీమేక్‌ చేశారు)లో రేడియో జాకీ (ఆర్జే)గా నటించిన విద్యా... మళ్లీ ఈ సినిమాలో ఆర్జేగా సులోచన పాత్రలో నటిస్తుండడం స్పెషల్‌. ఇంకో స్పెషల్‌ ఏంటంటే... శుక్రవారం పూజా కార్యక్రమాలతో ‘తుమ్హారీ సులు’ ప్రారంభమైంది.

ఈ పూజకు విద్యా తల్లి సరస్వతీ బాలన్‌తో పాటు చిత్ర నిర్మాతలు అతుల్, తనూజ్‌ గర్గ్, శాంతి శివరామ్, దర్శకుడు సురేశ్‌ త్రివేణిల మాతృమూర్తులు హాజరై చిత్రబృందాన్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారితో విద్యా ఫొటో దిగారు. ‘‘వండర్‌ఫుల్‌ మదర్స్‌ బ్లెస్సింగ్స్‌తో ‘తుమ్హారీ సులు’ ప్రారంభమైంది.మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదాలు కూడా ఉంటాయని ఆశిస్తున్నా’’ అని విద్యా పేర్కొన్నారు. పాటతో ఈ రోజు ముంబైలోని వోర్లీలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. జూన్‌ నెలాఖరుకి సినిమాని పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement