దోచుకునేందుకు వస్తున్నారు!

Sudheer Babu Nannu Dochukunduvate Teaser Release Date - Sakshi

సమ్మోహనం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘నన్ను దోచుకుందువటే’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన గులేభకావళి కథ చిత్రంలోని సూపర్‌ హిట్ పాట పల్లవినే ఈ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్‌ చేశారు.

ఈ సినిమాను సుధీర్‌ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుధీర్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌వచ్చింది. తాజాగా సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశారు చిత్రయూనిట్‌. జూలై 14 ఉదయం పది గంటల రెండు నిమిషాలకు టీజర్‌ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top