విక్రమ్‌ రాథోడ్‌, అత్తిలి సత్తిబాబులు గుర్తున్నారా?

SS Rajamouli Ravi Teja Vikramarkudu Telugu Movie Completed 14 Years - Sakshi

‘పోలీసోడు ట్రాన్స్‌ఫర్‌ అయితే పోలీస్‌ స్టేషన్‌కే వెళతాడు పోస్టాఫీస్‌కు కాదు’, ‘చావు అంటే బయపడటానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకు అనుకున్నావారా రాథోడ్‌ విక్రమ్‌ రాథోడ్‌’, ‘జింతాత జిత జిత జింతాత తా...’ అంటూ ‘విక్రమార్కుడు’ సినిమాలో పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో థియేటర్లలో అభిమానులతో విజిల్స్‌ వేయించారు మాస్‌ మహారాజ్‌ రవితేజ. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రం విడుదలై నేటికి 14 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘విక్రమార్కుడు’ విశేషాలు మీకోసం..

అత్తిలి సత్తిబాబు (రవితేజ), దువ్వ అబ్బులు (బ్రహ్మానందం)తో వచ్చే కామెడీ సీన్స్‌, ఆ తర్వాత నీరజా గోస్వామి (అనుష్క)తో అత్తిలి లవ్‌ అండ్‌ రొమాన్స్‌ సీన్స్‌, మధ్యలో కీరవాణి అందించిన పాటలు ఇలా ఫస్టాఫ్‌లో వచ్చే ప్రతీ విషయం కొత్తగా, ఎంటర్‌టైన్‌గా ఉంటాయి. ఆ తర్వాత బావూజీ (వినీత్‌ కుమార్‌), టిట్లా(అజయ్‌)లతో విలనిజం, ఆ తర్వాత ఓ రేంజ్‌లో పోలీసాఫీసర్‌ విక్రమ్‌ రాథోడ్‌ ఎంట్రీ, ఫ్యామిలీ డ్రామా, గుర్తుండిపోయే ముగింపు ఇలా అన్నీ కలగలపి ‘విక్రమార్కుడు’ని అద్భుతంగా తీర్చిదిద్దారు జక్కన్న. ఎక్కడా కూడా బోర్‌ కొట్టకుండా కామెడీ, ఎమోషన్‌, డైలాగ్‌లతో థియేటర్‌ ఆడియన్స్‌కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ విందును అందించాడు. (సీఎం జగన్‌కు ధన్యవాదాలు: రాజమౌళి)


ఇక ఈ సినిమా అనేక భాషల్లో స్ఠార్‌ హీరోలతో రీమేక్‌ అయినప్పటికీ తెలుగులో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో పోలీస్తే కాస్త తక్కువే అని చెప్పాలి.  ప్రేక్షకుల నాడీ తెలిసిన జక్కన్న రవితేజతో కలిసిన అద్భుత మ్యాజిక్‌ చేసిన ఈ చిత్రం ఇప్పటికీ టీవీల్లో వస్తే అందరూ టీవీల ముందు వాలిపోతారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌ రావాలని అటు రవితేజ అభిమానులతో పాటు ‘విక్రమార్కుడు’ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తుందో లేదో జక్కన్నకే తెలియాలి.  (జగన్నాథమ్‌ వచ్చి మూడేళ్లయింది)

‘విక్రమార్కుడు’లో అందరికీ నచ్చే డైలాగ్‌
‘‘నాకు భయం లేదని ఎందుకనుకుంటున్నారు సర్‌. ఎప్పుడో ఒక్కసారి కాదు రోజులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా సర్‌. నాలుగేళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణమైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సర్‌. మీకు చెప్పిన తలుపు చప్పుళ్లు, ఫోన్‌ రింగులు రావొచ్చు, రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు కచ్చితంగా వచ్చి తీరుతుంది సర్‌. ఆ రోజు దాన్ని కళ్లలోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సర్‌. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్‌లో ఉంటుంది సర్‌. దానికి ఒకటే కోరిక సర్‌.. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్లలో బెరుకు ఉండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం ఉండాలి సర్‌’’ (భవిష్యత్తుని చూపెట్టే టెనెట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top