ఆర్‌.. ఆర్‌.. ఆర్‌... ఈజ్‌ ఆన్‌ | SS Rajamouli announces new film with Jr NTR and Ram Charan Teja | Sakshi
Sakshi News home page

ఆర్‌.. ఆర్‌.. ఆర్‌... ఈజ్‌ ఆన్‌

Mar 23 2018 12:12 AM | Updated on Jul 14 2019 4:05 PM

SS Rajamouli announces new film with Jr NTR and Ram Charan Teja - Sakshi

కొంతకాలంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌లు ముగ్గురూ కలిసి ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమా చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. సినిమాలో లుక్‌ టెస్ట్‌ కోసం లాస్‌ ఏంజెల్స్‌ కుడా వెళ్లారు. కానీ అఫీషియల్‌గా చెప్పట్లేదు. ఫైనల్లీ ఈ సినిమా గురించి ఓ అఫీషియల్‌  ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ ఈ ముగ్గురు ‘ఆర్‌’లు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి, రామారావు (ఎన్టీఆర్‌), రామ్‌చరణ్‌. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నెక్ట్స్‌ సినిమా ఏంటా? అని తెలుగు అభిమానులతో పాటు మొత్తం ఇండియన్‌ సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో క్రేజీ మల్టీస్టారర్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఇంతకీ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అన్నది సినిమా టైటిలా లేక వర్కింగ్‌ టైటిలా తెలియాల్సి ఉంది.‘ ‘ఏ అనౌన్స్‌మెంట్‌ కోసమైతే నవంబర్‌ 2017 నుంచి మీరంతా ఎదురు చూస్తున్నారో అది అఫీషియల్‌గా ప్రకటిస్తున్నాం. మాసీవ్‌ మల్టీస్టారర్‌ ఈజ్‌ ఆన్‌’’ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఇది టైటిల్‌ మాత్రమే కాదు ది టైటాన్స్‌ కమింగ్‌ టుగెదర్‌’’ అంటూ వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో  ఎన్టీఆర్, చరణ్‌.. ఇద్దరూ బాక్సర్స్‌గా, అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తార ని సమాచారం. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుందట. వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్‌ అవుతుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement