దట్టమైన అడవిలో...

SS Karthikeya debut project in final leg of shooting - Sakshi

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి వద్ద ‘ఈగ, బాహుబలి’ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఆకాశవాణి’. ఈ చిత్రంతో రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాతగా మారారు. షోయింగ్‌ బిజినెస్‌ పతాకంపై ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ 90 శాతం పూర్తయింది. ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అశ్విన్‌ గంగరాజు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథతో రూపొందిస్తోన్న చిత్రమిది. ఓ రేడియో చుట్టూ దట్టమైన అడవిలో కథ సాగుతుంది.  పాడేరు అటవీ ప్రాంతంలో వేసిన భారీసెట్‌తో పాటు ఇతర లొకేషన్స్‌లో దాదాపు 50 రోజుల పాటు ఒకే షెడ్యూల్‌లో 90శాతం సినిమాను పూర్తి చేశాం. ఈ షెడ్యూల్‌ చాలా సాహసంగా అనిపించింది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దర్శకుడు, తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ రగుతు:

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top